3 January, 2019 | Category : NEWS

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 రోజుల సార్వత్రిక సమ్మె చాలా ముఖ్యమయిన సమ్మె. అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు దేశ వ్యాప్తముగా ఈ సార్వత్రిక సమ్మె లో పాల్గొంటున్నారు. బిఎస్ ఎన్ఎల్ లో బిఎస్ఎన్ఎల్ ఇయు, ఎన్ఎఫ్ టిఈ, బిఎస్ఎన్ఎల్ మజ్దూర్ సంఘ్, టి ఈపియు లు ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలియ జేస్తూ సమైక్యముగా సమ్మె నోటీసునిచ్చాయి.

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 రోజుల సార్వత్రిక సమ్మె చాలా ముఖ్యమయిన సమ్మె. అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు దేశ వ్యాప్తముగా ఈ సార్వత్రిక సమ్మె లో పాల్గొంటున్నారు. బిఎస్ ఎన్ఎల్ లో బిఎస్ఎన్ఎల్ ఇయు, ఎన్ఎఫ్ టిఈ, బిఎస్ఎన్ఎల్ మజ్దూర్ సంఘ్, టి ఈపియు లు ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలియ జేస్తూ సమైక్యముగా సమ్మె నోటీసునిచ్చాయి. ఈ సమ్మెకి మనము ఎన్ఎఫ్ టిఈ కలిసి ప్రచారం చేయాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరూ ఈ సమ్మె లో పాల్గొనేలా చేయాలి. సమ్మె చేయటం వరకే పరిమితమయితే కావలసినంత ఫలితం రాదు. మోడీ ప్రభుత్వము కార్మిక వర్గం పై ప్రజల పై ప్రభుత్వ రంగ సంస్థల పై చేస్తున్న దాడిని వివరించి చెప్పవలసిన అవసరం వుంది. ప్రభుత్వ విధానాలు బాగా లేవని చెపితే చాలదు. మరి ఏ విధానాలైతే బాగుంటాయో చెప్పాలి. ఇందుకు అధ్యయనం అవసరం. అప్పుడు మాత్రమే మనము వాస్తవాలను వివరించి చెప్పగలం. ఈ అధ్యసం కోసం కా పి.అశోకబాబు సర్కిల్ సెక్రటరీ రచించిన ఈ బుక్లెట్ ను సర్కిల్ యూనియన్ వాట్సప్ లో మరియు సర్కిల్ యూనియన్ వెబ్సైట్ పెడుతున్నాము. సర్కిల్ యూనియన్ వెబ్సైట్ నుండి ఈ బుక్లెట్ ను ప్రింటెడ్ కాపీ ని తీసుకుని ఈ బుక్ లెట్ ను సర్కిల్ యూనియన్ ఆఫీసు బేరర్లు, జిల్లా సెక్రెటరీలు, సర్కిల్ కఆర్డినేటర్లు, బ్రాంచి సెక్రెటరీలు అందరూ తప్పని సరిగా చదుపాలి. జిల్లా సెక్రటరీలు, సర్కిల్ యూనియన్ ఆఫీసు బేరర్లు తాము చదవటమే కాకుండా వీలయినంత ఎక్కువ మంది చదివేలా చూడాలి. జిల్లాలో వున్న నాన్ ఎగ్జిక్యూటివ్ లందరికి మరియు ఎగ్జిక్యూటివ్ లకు సమ్మె సందేశం ప్రతి ఒక్కరికి చేరేందుకు ఒక కరవత్రాన్ని మనము, ఎన్ ఎఫ్టిఊ కలిసి జిల్లా స్థాయిలో ఒక కరవత్రాన్ని ముద్రించి అందరికీ పంచాలి. ఈ కరపత్రం నమూనాను రేపు (3.1.2019) వాట్సప్ లో వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తాము. సమ్మె ప్రచారం ఎన్ఎఫ్ టిఈ తోకలిసి చేసేందుకు ఎన్ఎఫ్ టిఇ జిల్లా సెక్రటరీ తో వెంటనే సంప్రదించి తగు ప్రణాళిక ను రూపొందించాలి. సమయం ఎక్కువ లేనందున తక్షణమే కార్యక్రమానికి దిగాలి. అభినందనలతో పి.అశోకబాబు, సి ఎస్

RELATED POSTS :

14 January, 2019 | Category : NEWS

వేతన సవరణ తదితర డిమాండ్స్ పై 3.12.2018 న మంత

వేతన సవరణ తదితర డిమాండ్స్ పై 3.12.2018 న మంత్రి గారు ఇచ్చిన హా

READ MORE

4 January, 2019 | Category : NEWS

ప్రియమైన కాన్రేడ్స్, జనవరి 8, 9 తేదీలలో

జనవరి 8, 9 తేదీలలో జరుగు దేశ వ్యాపకమును గా జరుగు సార్వత్

READ MORE