12 October, 2018 | Category : NEWS

28.1.2018 న జరిగిన జేఈ ప్రమోషన్ పరీక్ష ఫలితాల రివ్యూ లో ఎస్ సి/ఎస్ టి ఉద్యోగులకు ఇయ్యవలసిన రిలాక్షేషన్ ను వెంటనే ఇచ్చి ఫలితాలను ప్రకటించాలి

28.1.2018న జరిగిన జెఈ ప్రమోషన్ పరిక్ష లో అతి తక్కువ మంది మాత్రమే పాస్ అయినందున క్వాలిఫయింగ్ మార్కుల్లో రిలాక్షేషన్ ఇవ్వాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. నేషనల్ కవున్సిల్ లో నూ విడి గాను అనేక సార్లు మేనేజిమెంటు తో చర్చించింది. ఇందుకు మేనేజిమెంటు అంగీకరించి 31.8.2018న ఆర్డర్సు ఇచ్చింది. దీని ప్రకారం ఓసీ/ఓబీసీ అభ్యర్థులకు క్వాలిఫయింగ్ మార్కులను సెక్షన్ కు 30 శాతం నుండి 20 శాతం కి, ఎగ్రిగేట్ మార్కులను 37 శాతం నుండి 30 శాతం కి తగ్గించారు. ఎస్ సి/ఎస్ టి అభ్యర్థులకు సెక్షన్ కు 20 శాతం నుండి 15 శాతం కు తగ్గించారు. ఎగ్రిగేట్ మార్కులను 30 శాతం నుండి 23 శాతం కు తగ్గించారు. ఈ సడలించిన మార్కుల ప్రకారం ఫలితాలను రివ్యూ చేసి క్వాలిఫై అయిన వారి లిస్టును కార్పొరేట్ ఆఫీసు 3.10.2018న ప్రకటించింది. ఈ లిస్టు ప్రకారం ఏ.పి సర్కిల్ లో 23 మంది క్వాలిఫై అయ్యా రు. వీరిలో ఎస్ సి ఒకరు, ఎస్ టి ఇద్దరూ వున్నారు. దేశం మొత్తముగా ఈ రివ్యూ లో 250 మంది క్వాలిఫై అయ్యారు. కానీ బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కృషి ఫలితము గా కార్పొరేట్ ఆఫీసు 28.8.2017న ఇచ్చిన ఆర్డరు ప్రకారం ఎస్ సి అభ్యర్థులకు సెక్షన్ కు 20 శాతం , ఎస్ టి అభ్యర్థులకు సెక్షన్ కు 15 శాతం వస్తే క్వాలిఫై అవుతారు. ఎగ్రిగేట్ క్వాలిఫయింగ్ మార్కులతో సంబంధం లేదు. కాబట్టి ఈ సడలింపు ప్రకారం ఎస్ సి/ఎస్ టి అభ్యర్థుల ఫలితాలను రివ్యూ చేయాలని కోరుతూ బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియను 23.5.2018న మేనేజిమెంటుకు లెటరు రాసింది. నిన్న (10.10.2018న) మరొక సారి కార్పొరేట్ ఆఫీసు జి ఏం (రిక్రూట్మెంటు) ను కలిసి ఈ రివ్యూ వెంటనే చేయాలని డిమాండ్ చేసింది.

  1. Review resultof failed SC ST candidates (2).pdf : Download File

RELATED POSTS :

5 February, 2019 | Category : NEWS

వేతన సవరణ తదితర డిమాండ్ల పై ఇచ్చిన హామ

వేతన సవరణ తదితర డిమాండ్ల పై ఇచ్చిన హామీలు అమలు చేయకుండ

READ MORE

16 February, 2019 | Category : NEWS

ఫే రివిజన్ పై పరిణామాలు

ఫే రివిజన్ పై పరిణామాలు గత రెండు రోజులుగా సిఎండి మరియు

READ MORE

18 February, 2019 | Category : NEWS

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికి సర్

సర్కిల్ లో అన్ని జిల్లాలలో ఈ రోజు సమ్మె విజయవంతముగా జర

READ MORE